Monday, January 20, 2025

జైలు నుంచి విడుదలైన కవిత..

- Advertisement -
- Advertisement -

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా కవిత భర్త, పిల్లలు, కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. జైలు నుంచి బయటకు వచ్చిన కవిత.. తన కొడుకును భర్తను గట్టిగా కౌగిలించుకుని కన్నీరు పెట్టుకున్నారు.  అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. రేపు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి కవితతోపాటు కేటీఆర్, హరీశ్ రావులు హైదరాబాద్ కు చేరుకోనున్నారు.

కాగా, ఇవాళ ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత దాఖలు చేసిన పిటిషన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఇరువర్గాల న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం.. కవితకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఒక్కొ కేసులో రూ.10 లక్షల విలువైన షూరిటీలు సమర్పించాలని కండిషన్ పెట్టింది. పాస్ పోర్టు కూడా అప్పగించాలని.. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడని ఆదేశించింది కోర్టు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News