మహిళా సాధికారత కోసం కలిసి పనిచేద్దాం..
రిజర్వేషన్లు సాధించే వరకు పోరాడుదాం..
మహిళా రిజర్వేషన్ బిల్లుపై వీడియో రిలీజ్ చేసిన ఎంఎల్‌సి కవిత
హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ బిల్లుపై మరోసారి ఎంఎల్‌సి కవిత ట్వీట్ చేశారు. మహిళలు అడ్డంకులను ఛేదించి తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. మహిళా సాధికారత కోసం కలిసి పనిచేద్దామంటూ పిలుపు నిచ్చారు. మహిళలు నింగిలో సగం, నేలలో సగం, జనాభాలో సగం. కానీ చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లను మాత్రం సాధించలేకపోయామన్నారు. రిజర్వేషన్లు సాధించే వరకు పోరాడుదామంటూ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోనూ రిలీజ్ చేశారు.
ప్రతి ఇంటా సిరిసంపదలు వెల్లివిరియాలి
అంతకుముందు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్ష్లు తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలుగింటి నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా ప్రజలంతా ప్రగతిపథంలో ముందుకు సాగాలని కోరారు. ప్రతి ఇంటా ఆరోగ్యం-ఆనందంతోపాటు సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరు కుంటూ.. ప్రజలందరికీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
This Navratri let's work together to break down barriers and empower women to reach their full potential.#WomenReservationBill #MorePowerToWomen pic.twitter.com/qKk9KrL0za
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 22, 2023