Wednesday, January 22, 2025

కవిత, కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు లో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవె న్యూ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. ఇడి, సి బిఐ కేసులో ట్రయల్ కోర్టు విధించిన జ్యుడిషియల్ కస్ట డీ మంగళవారంతో ముగియటంతో రెండు దర్యాప్తు సంస్థలు కవిత, కేజ్రీవాల్‌ను వర్చువల్‌గా కోర్టు ముం దు హాజరుపరిచారు. మరోసారి కస్టడీని పొడిగించాల న్న దర్యాప్తు సంస్థల విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం ఇద్ద రి జ్యుడిషియల్ కస్టడీని మే 7వ తేదీ వరకు పొడిగించింది. మరోవైపు ఇడి కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. సోమవారం విచారణకు కొనసాగింపుగా రౌస్ అవెన్యూ కోర్టులో జరిగిన విచారణలో ఇడి తరఫున న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. కవితకు బెయిల్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. సెక్షన్ 19 అనుగుణంగా కవిత అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని కోర్టుకు నివేదించారు. కవితను అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వలేదన్న ఇడి, 10 రోజుల పాటు సమన్లు ఇవ్వబోమని మాత్రమే ఇడి 2023 సెప్టెంబర్ 26న అండర్‌టేకింగ్ ఇచ్చిందని వెల్లడించారు.

తనపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేసి, మళ్లీ ఉపసంహరించుకోవడాన్ని చూస్తే అరెస్ట్ చట్టవిరుద్దంగా జరగలేదని అర్థమవుతోందని ఇడి తరఫున న్యాయవాది అన్నారు. కవితకు వ్యతిరేకంగా శరత్‌రెడ్డి, బుచ్చిబాబు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ వాంగ్మూలాలు ఇచ్చారని గుర్తు చేశారు. కవితను సూర్యాస్తమయం కంటే ముందు అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అరెస్టుకు గల కారణాలు చెప్పి కవిత సంతకం తీసుకున్నామన్న ఇడి తరఫున న్యాయవాది జోయబ్ హుస్సేన్, అరెస్టు చేసిన 24 గంటల్లోనే కోర్టులో హాజరు పరిచామని తెలిపారు. అయితే, కేసు దర్యాప్తునకు సంబంధించి వివరాలను ఇడి కోర్టుకు అందజేసింది. 60 రోజుల్లో కవిత అరెస్ట్‌పై చార్జ్ షీట్ సమర్పిస్తామని కోర్టుకు వెల్లడించింది. ఇడి తరపున సుదీర్ఘ వాదనలున్నాయని కోర్టుకు తెలపటంతో విచారణను రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం మధ్యాహ్నం జరిగే విచారణలో ఇడి వాదనలనంతరం కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.

ఎంఎల్‌సి కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సోమవారం కోర్టులో విచారణ జరిగింది. కవిత తరఫున న్యాయవాదులు వారి వాదనలు వినిపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆమెను అరెస్టు చేశారని, అప్పటికే ఇడి కస్టడీలో ఉన్నా సిబిఐ ఎందుకు అరెస్టు చేసిందని ప్రశ్నించారు. అరెస్టు చేయాల్సిన అవసరం లేకున్నా చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాగా దీనికి కొనసాగింపుగా మంగళవారం కోర్టులో విచారణ జరగగా మళ్లీ బుధవారానికి వాయిదా పడింది. మరోవైపు, ఈ కేసుకు సంబంధించి కవితను సిబిఐ ఏప్రిల్ 11న అరెస్ట్ చేసింది. దీనిపై ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా మే 2న తీర్పు వెల్లడి కానుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న అరెస్టైన కవిత జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News