Friday, April 4, 2025

నోటీసులో అది లేదు.. అందుకే నా లాయర్ ను పంపించా: కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసులో లేకపోవడంతో తన తరపున లాయర్‌ను పంపించానని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత పేర్కొన్నారు. ఇడికి ఎంఎల్‌సి కవిత లేఖ రాశారు. ఇడి కోరిన డాక్యుమెంట్లను పంపించానని, సుప్రీం కోర్టు నిర్ణయం తరువాత విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. తనకు ఇచ్చిన సమన్లలో ఎక్కడా ఫోన్ సీజ్ చేస్తామని చెప్పలేదని, అయినా విచారణ సమయంలో తన పోన్ సీజ్ చేశారని కవిత ఆవేదన వ్యక్తం చేసింది.

బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితపై కేంద్రం కక్ష కట్టిందని కవిత తరపున లాయర్ భరత్ తెలిపారు. తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, కవిత తరపున డాక్యుమెంట్లు ఇడికి అందించామని, విచారణలో ఇడి నిబంధనలు ఉల్లంఘించారన్నారు. అక్రమంగా కవిత సెల్‌ఫోన్‌ను సీజ్ చేశారని భరత్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News