Monday, December 23, 2024

జర్నలిస్టు జమీర్ మరణం బాధాకరం: కవిత

- Advertisement -
- Advertisement -

MLC Kavitha respond on Jammer dead

జగిత్యాల: విధి నిర్వహణలో భాగంగా వరదల్లో కొట్టుకుపోయిన జగిత్యాల జిల్లా రాయికల్ చెందిన జర్నలిస్టు జమీర్ మరణం అత్యంత బాధాకరమని ఎంఎల్ సి కవిత ట్వీట్ చేశారు. జమీర్ కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. వార్తా సేకరణకు ప్రాధాన్యత ఇస్తూనే, వర్షాలు, వరదల పట్ల అప్రమత్తంగా ఉండడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మీడియా మిత్రులను ఎంఎల్సి కవిత  కోరారు.  రాయికల్ లో ఓ ప్రముఖ ఛానల్ రిపోర్టర్ జమీర్  రామోజీ పేట్- భూపతి పూర్ రోడ్డులో కారుతో సహా జమీర్ వరద ప్రమాదం లో గల్లంతైన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్ లో రిపోర్టర్ జమీర్ మృతదేహం లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News