హైదరాబాద్ : బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. రేపు ఢిల్లీలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడించారు. ఈడీ విచారణకు హాజరయ్యే తేదీపై అంశంపై న్యాయ సలహా తీసుకుంటానని కవిత చెప్పారు. ముందస్తు అపాయింట్ మెంట్ల రీత్యా హాజరుపై సలహా తీసుకుంటానన్నారు. మహిళ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలన్నదే బిఆర్ఎస్ డిమాండ్ అన్నారు. ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలతో కలిసి ఒక రోజు దీక్ష తలపెట్టామని కవిత తెలిపారు. ఈ నెల 10న ఢిల్లీలో భారత్ జాగృతి ఒకరోజు నిరాహార దీక్ష తలపెట్టామన్నారు. బిజెపి వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని కవిత తేల్చిచెప్పారు. కెసిఆర్, బిఆర్ఎస్ పార్టీని లొంగదీసుకోవడం కుదరని బిజెపి తెలుసుకోవాలన్నారు. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తామని సూచించారు.