Monday, December 23, 2024

ఫిర్యాదు కాపీ, ఎఫ్‌ఐఆర్ ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో క్లారిఫికేషన్ కోసం సిబిఐ ఇచ్చిన నోటీసులకు టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ప్రతి స్పందించారు. క్లారిఫికేషన్ కోసం మీ దగ్గరకు రావాలని అనుకుంటున్నామని శుక్రవారం ఆమెకు సిఆర్‌పిసి సెక్షన్ 160 నోటీసు ద్వారా సిబిఐ సమాచారం ఇచ్చింది. దానికి కవిత స్పందిస్తూ శనివారం సిబిఐ అధికారి అలోక్ కుమార్ వాహీకి ఒక లేఖ రాశారు.

సిబిఐకి కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా న మోదు చేసిన ఎఫ్‌ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరారు. డా క్యుమెంట్లను పంపిన తర్వాతే హైదరాబాద్‌లో కలుద్దామన్నారు. అ లాగే ఎఫ్‌ఐఆర్ కాపీని అందించిన తర్వాతే వివరణ ఫిక్స్ చేద్దామన్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా సంబంధిత కాపీలను అందించాలని సిబిఐకి రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు.

సిఎం కెసిఆర్‌తో కవిత భేటీ?

కాగా టిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత శనివారం ప్రగతిభవన్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సిబిఐ నుంచి వ చ్చిన నోటీసులపై చర్చించినట్లుగా తెలుస్తోంది. నోటీసులపై ఎలాం టి వైఖరితో ముందుకు సాగాలి? విధంగా ఎదుర్కొవాలనే అం శంపై కెసిఆర్‌తో ఆమె చర్చించినట్టుగా తెలుస్తోంది. అలాగే న్యా యపరమైన అంశాలపై సంబంధిత నిపుణుల నుంచి అభిప్రాయాల ను తీసుకున్నట్లుగా సమాచారం. మరోవైపు కవితకు నోటీసులపై ప్రతిపక్షాలు, ముఖ్యంగా మొదటి నుంచి బిజెపి చేస్తున్న విమర్శల ను ఏ విధంగా తిప్పికొట్టానే అంశాలను కూడా చర్చించినట్లుగా టిఆర్‌ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది.

కవితకు మద్దతుగా ఫ్లెక్సీలు, పోస్టర్లు

కవితకు మద్దతుగా నగరంలోని పలు ప్రాంతాల్లో పెద్దఎత్తన ఫ్లెక్సీ లు, వెలిశాయి. టిఆర్‌ఎస్ యువజన నాయకులు అలిశెట్టి అరవింద్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాం తాల్లో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ భాగంగానే ఎంఎల్‌సి కవిత కు సిబిఐ నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు. చైతన్యంతో కూడిన తెలంగాణలో విద్వేష పూరిత ప్రసంగాలతో ఒకవైపు ప్రజలను రెచ్చగొడుతూనే, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న నా యకులను వేధిస్తే ఊరుకోరని ఆయన హెచ్చరించారు. అది బిజెపికే ప్రమాదమన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News