- Advertisement -
నిజామాబాద్: జిల్లాలో మహిళపై జరిగిన అత్యాచార ఘటన చాలా బాధాకరమని ఎమ్మెల్యేసి కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలను ఏమాత్రం ఉపేక్షించదన్నారు. 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసిన పోలీస్ శాఖకు ఆమె అభినందనలు తెలిపింది. సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల్లో షీ టీంలను ఏర్పాటు చేసి, ఆడబిడ్డలకు భరోసానిస్తున్నారన్నారు. మహిళలపై వివక్ష చూపినా, అఘాయిత్యాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయదన్నారు. నిజామాబాద్ లో అత్యాచారానికి గురైన బాధితురాలికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున మరియు వ్యక్తిగతంగానూ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని కవిత చెప్పింది.
MLC Kavitha responds on Girl raped in Nizamabad
- Advertisement -