Monday, January 20, 2025

ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తిరిగొచ్చిన కవిత, కెటిఆర్, హరీష్‌రావు..

- Advertisement -
- Advertisement -

కవితకు గుమ్మడికాయతో దిష్టి తీసిన కుటుంబసభ్యులు
జై కవిత అంటూ నినాదాలు చేసిన అభిమానులు
ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తిరిగొచ్చిన
మంత్రులు కెటిఆర్, హరీష్‌రావు, ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: ఈడీ విచారణ అనంతరం (సుమారు 8 గంటల తరువాత) ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని తుగ్లక్‌రోడ్డులో ఉన్న సిఎం కెసిఆర్ నివాసానికి వెళ్లారు. అక్కడ ఆమెకు అభిమానులు, కుటుంబసభ్యులు హారతి ఇచ్చి గుమ్మడికాయతో దిష్టితీసి ఇంట్లోకి ఆహ్వానించారు. అనంతరం కుటుంబసభ్యులు కవితను ఆలింగనం చేసుకున్నారు.

బిఆర్‌ఎస్ మంత్రులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తుగ్లక్‌రోడ్డుకు భారీగా చేరుకొని జై కవిత అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మంత్రులు కెటిఆర్, హరీష్‌రావులతో కలిసి కవిత తన కుటుంబసభ్యులు, ముఖ్యనాయకులతో ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తిరిగివచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News