Wednesday, January 22, 2025

గాయకులతో కలిసి బతుకమ్మ పాటలను పాడిన ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల
ప్రజల నుంచి అరుదైన పాటల సేకరణకు భారత్ జాగృతి సంస్థ శ్రీకారం

మనతెలంగాణ/హైదరాబాద్: బతుకమ్మ సంబరాలకు భారత్ జాగృతి సంస్థ సన్నాహాలు మొదలుపెట్టింది. భారత్ జాగృతి ఆధ్వర్యంలో రాబోతున్న బతుకమ్మ పాటకు సంబంధించిన వీడియోను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ప్రముఖ గాయకులు తేలు విజయ, పద్మావతి, మౌనిక యాదవ్, సౌమ్యలతో పాటు భారత్ జాగృతి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ కోడారి శ్రీనుతో కలిసి కవిత పాటపాడారు.

జాగృతి యాప్‌లో ఇప్పటికే దాదాపు 150 బతుకమ్మ పాటలు ఉన్నాయి. కాగా, ప్రజల సహకారంతో అరుదైన, ప్రాచీన, కొత్తగా పూర్తిచేసిన బతుకమ్మ పాటలను భారత్ జాగృతి సంస్థ సేకరిస్తోంది. దీనికోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్ +91 8985699999ను కేటాయించింది. ఆ నంబర్‌కు వాట్సాప్ ద్వారా పాటలను పంపించాలని ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు. అంతేకాక తమకు ఇష్టమైన బతుకమ్మ పాటలను సామాజిక మాధ్యమాల్లో భారత్ జాగృతికి ట్యాగ్ చేస్తూ పోస్టులు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బతుకమ్మ పాటలు సేకరణ, రూపకల్పనలో క్రియాశీలకంగా వ్యవహారించిన జాగృతి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ గుడారి శ్రీనును అభినందించారు.

Kavitha 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News