ధర్మపురి : ధర్మపురిలో గురువారం జరిగిన బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొని సంప్రదాయ బతుకమ్మ పాటను ఆలపించారు. ఇప్పుడు ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత ధర్మపురిలో పర్యటించగా ఆమెకు స్వాగతం పలికేందుకు వందలాది మంది మహిళలు తరలివచ్చారు. సభను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ… వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా కోలాటం పోటీలు నిర్వహిస్తామన్నారు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో తెలంగాణ అభివృద్ధిపథంలో దూసుకుపోతోందని కవిత అన్నారు. బతుకమ్మ పండుగ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత చురుగ్గా పాల్గొంటున్న ముచ్చట తెలిసిందే.
Look who blessed our #Bathukamma celebrations today!
Rain, folk songs and the super energetic women power of Dharmapuri ❤️ pic.twitter.com/mcvG5X71j9
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 29, 2022