Friday, January 31, 2025

సిఎం రేవంత్ రెడ్డి మిస్ గైడెడ్ మిస్సైల్‌లా పనిచేస్తున్నారు:ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

నీళ్ల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తున్నదని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కెసిఆర్‌పై అక్కసుతో కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేయడమే కాకుండా రైతులకు నీళ్లు ఇవ్వకుండా పొలాలను ఎండబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బురదరాజకీయానికి గోదావరి వరదను కూడా తట్టుకొని మేడిగడ్డ బ్యారేజీ మేరునగధీరుడిలా నిలబడిందని అన్నారు. ‘తెలంగాణ జలవనరులు, ప్రాజెక్టలపై నీళ్లు- నిజాలు’ అనే అంశంపై తెలంగాణ జాగృతి సంస్థ శుక్రవాం నాడు

సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితతో పాటు మేధావులు, విశ్రాంత ఇంజనీర్లు పాల్గొన్నారు. అనంతరం పలు తీర్మానాలు ఆమోదించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి కవిత మాట్లాడుతూ… కెసిఆర్ పూర్తి చేసిన ప్రధాన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న చిన్న చిన్న పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీయంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని, కాంగ్రెస్ ప్రభుత్వం రాజనీతజ్ఞతను ప్రదర్శించాలని సూచించారు.

మన జలాలను తరలిస్తున్న ఆంధ్రా పాలకులు శతృవులు
వైఎస్‌ఆర్ ప్రారంభించిన ఆరోగ్య శ్రీని కెసిఆర్ కొనసాగించారని, కాంగ్రెస్ ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని బిజెపి కొనసాగిస్తోందని తెలిపారు. అదే తరహాలో కెసిఆర్ ప్రారంభించిన పనులను సిఎం రేవంత్ రెడ్డి కొనసాగించాలని ఎంఎల్‌సి కవిత డిమాండ్ చేశారు. సిఎం రేవంత్ రెడ్డి మిస్ గైడెడ్ మిస్త్స్రల్ లా పనిచేస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్ శతృవు అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు.. కానీ మన జలాలను తరలిస్తున్న ఆంధ్రా పాలకులు మన శతృవులని ఆయన గమనించాలని వ్యాఖ్యానించారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేసుకొని 15 లక్షల ఎకరాలకు నీళ్లించుకోవడం జరిగిందని, కేవలం చెరువులను బాగు చేసుకోవడం వల్ల 9.6 టీఎంసీల నీటిని ఒడిసి పట్టుకున్నామని ఎంఎల్‌సి కవిత అన్నారు. అందుకు సాక్ష్యం తెలంగాణ ఏర్పడే

సమయానికి 68 లక్షల టన్నుల వరి పండితే… 2022- 23 నాటికి కోటి 68 లక్షల టన్నుల ధాన్యం పండిందని, వరి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానానికి ఎదిగిందని స్పష్టం చేశారు. ఇన్ని చేసినా పదేళ్లలో ఏమి జరగలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. గతంలో కాంగ్రెస్, టిడిపి పార్టీలు పరిపాలించి ప్రాజెక్టుల్లో పల్లేర్లు మొలిపించాయని, కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం ఫైరవీలు చేసుకున్నారు తప్ప ప్రాజెక్టుల కోసం కొట్లాడలేదని మండిపడ్డారు. రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ కార్పోరేషన్ చైర్మన్ వీ ప్రకాశ్, సాగునీటి శాఖ మాజీ ఒఎస్‌డి, విశ్రాంత ఇంజనీర్ శ్రీధర్ రావు దేశ్ పాండే, బిఆర్‌ఎస్ నాయకుడు పల్లె రవి కుమార్ గౌడ్, రిటైర్డ్ సిఇ ఖగేందర్, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం మాజీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, తెలంగాణ ఇంజనీర్స్ జేఏసీ కార్యదర్శి వెంకటేశం,

అంతర్ రాష్ట్ర వ్యవహారాల మాజీ ప్రభుత్వ సలహాదారు టంకశాల అశోక్, ఫ్లోరోసిస్ విమోచన సమితి నాయకులు కంచుకట్ల శ్రీనివాస్, తెలంగాణ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్, సీనియర్ జర్నలిస్టు కామెర నవీన్ కుమార్, బీసీ సంఘం నాయకుడు బొళ్ల శివశంకర్ , ఏల్చల దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News