Sunday, January 19, 2025

మూసీ పేరుతో పేదల ఇళ్లు కూల్చి మాల్‌లు కడుతున్నారు: కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మూసీ విషయంలో మంత్రి శ్రీధర్ బాబు తప్పుదోవ పట్టించారని ఎంఎల్‌సి కవిత మండిపడ్డారు. మూసీ కోసం ప్రపంచ బ్యాంకును డబ్బులు అడగలేదని మంత్రి చెబుతున్నారని, మూసీ కోసం రుణం అడిగినట్టు సాక్ష్యాలు బయటపెడుతామని తెలియజేశారు. శాసన మండలిలో కవిత ప్రసంగించారు. డిపిఆర్‌లేదని అసెంబ్లీలో చెబుతున్నారని, ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన నివేదికలో డిపిఆర్ ఉందని చెప్పారని గుర్తు చేశారు. ఎవరి లబ్ధి కోసం అవాస్తవాలు చెబుతున్నారని కవిత ప్రశ్నించారు. ప్రపంచ బ్యాంకును మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ తెలంగాణలో అడుగుపెట్టనివ్వలేదన్నారు. మూసీ కోసం కేంద్రాన్ని సిఎం రేవంత్ రెడ్డి రూ.14 వేల కోట్లు అడిగారని, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి, ప్రపంచ బ్యాంకుకు, ప్రజలకు వేర్వేరుగా చెబుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఆస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తోందని ధ్వజమెత్తారు. మూసీ ప్రాజెక్టుపై అబద్ధాలాడుతున్న ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తేలేదని హెచ్చరించారు. మూసీ పేరుతో పేదల ఇళ్లు కూలిస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. మూసీ పేరుతో పేదల ఇళ్లు కూల్చి మాల్‌లు కట్టాలని కుట్రలు చేస్తున్నారని కవిత విమర్శలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News