Friday, April 4, 2025

నన్ను ఇబ్బంది పెట్టినోళ్లకు వడ్డీతో చెల్లిస్తా: కవిత

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ బిడ్డను..భయపడే రకం కాదు 
ఇప్పటికే మొండిదాన్ని..అనవసరంగా జగమొండిగా మార్చారు
తీహార్ జైలు నుంచి విడుదల అనంతరం కవిత వ్యాఖ్యలు
భర్త, కుమారుడు, కెటిఆర్‌ను హత్తుకొని భావోద్వేగానికి గురైన కవిత
జైలు బయట బిఆర్‌ఎస్ శ్రేణుల సంబరాలు, స్వీట్ల పంపిణీ

మన తెలంగాణ/హైదరాబాద్: ఈ కష్టసమయంలో తనకు, బిఆర్‌ఎస్ పార్టీకి, కార్యకర్తలకు, తన కుటుంబానికి అండగా ఉన్న తెలంగాణ ప్రజలకు బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత పాదభివందనాలు తెలియజేశారు. తిహార్ జైలు నుంచి విడుదల అయిన తర్వాత కవిత మాట్లాడుతూ నేను కేసీఆర్ బిడ్డను, తెలంగాన బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను అసలే మొండిని. నన్ను జైలుకు పంపించి జగమొండిని చేశారు అని తేల్చి చెప్పారు. తన తప్పు లేకుండానే జైలులో వేశారని అన్నారు.

తనను అక్రమంగా, అన్యాయంగ, కేవలం రాజకీయ కక్షతోనే జైలుకు పంపించా రన్నారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాననని శపథం చేశారు. సమయం కచ్చితంగా వస్తుందని, అప్పుడు కచ్చితంగా స్పష్టం చేశారు. రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేస్తూనే ఉంటానని ప్రకటించారు. 18 నసంవత్సరాలు నేను రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉన్నానని, కానీ వ్యక్తిగతంగా తనకు కుటుంబానికి, తన పిల్లలకు దూరంగా ఇంత కాలంగా ఎప్పుడూ లేనని భావోద్వేగంగా ప్రసంగం చేశారు. తన సోదరుడు ఎంఎల్‌ఎ కెటిఆర్, ఎంఎల్‌ఎ హరీష్ రావు, బిఆర్‌ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News