Sunday, January 19, 2025

2001 నుంచి వారు కెసిఆర్ వెంటే ఉన్నారు: కవిత

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి న్యూస్: 2001 నుంచి ఎంతో మంది కార్యకర్తలు సిఎం కెసిఆర్ వెంట ఉన్నారని ఎంఎల్‌సి కవిత తెలిపారు. ఎల్లారెడ్డి పేటలో జరిగిన టిఆర్‌ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో  కవిత మాట్లాడారు. మన రాష్ట్రం మనకుంటేనే మనం బాగుపడుతామని సిఎం కెసిఆర్ ఉద్యమం చేశారని, కెసిఆర్ ఉద్యమంలో ఎక్కడా వెనక్కి పోలేదు కాబట్టి తెలంగాణ వచ్చిందని ప్రశంసించారు.  గ్రామంలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకం చేరాలని ఆకాంక్షించిన వ్యక్తి సిఎం కెసిఆర్ కొనియాడారు. ఎల్లారెడ్డి పేటలో 50 వేల మంది టిఆర్‌ఎస్ కార్యకర్తలు ఉన్నారన్నారు.

ఎంతో మంది వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన ఆగం కావొద్దని కవిత సూచించారు. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రశంసించారు. మన రైతుబంధును పిఎం కిసాన్‌గా మోడీ ప్రభుత్వం కాపీ కొట్టారని దుయ్యబట్టారు. పిఎం కిసాన్ పథకంలో పది కోట్ల మంది రైతులను ఎందుకు తగ్గించారని ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు.  ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు కథానాయకులు కావాలని పిలుపునిచ్చారు. రాంరాం జప్‌నా… పరాయి లీడర్ అప్‌నా అనేది బిజెపి పని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News