Wednesday, January 22, 2025

ఎడ్లబండిపై ప్రయాణించిన ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: తెలంగాణ రైతు దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలం పద్మాజివాడి రైతు వేదికను స్థానిక శాసనసభ్యులు జాజాల సురేందర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజిబొద్దిన్, స్థానిక‌ ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్సీ కవిత శనివారం ప్రారంభించారు.

పద్మాజివాడి చౌరస్తా నుంచి రైతు వేదిక వరకు ఎడ్లబండి పైన కూర్చొని వెళ్లారు. ఆమె వెంట ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, పలువురు రైతులు ఉన్నారు. రైతు దినోత్సవం పురస్కరించుకొని ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. పద్మాజి వాడి రైతు వేదిక కార్యక్రమంలో ఎంపీపీ అనసూయ, సర్పంచ్ కవిత, ఎంపీటీసీ సభ్యురాలు సుజాత, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News