Tuesday, December 3, 2024

ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ కు కవిత

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్‌పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బుధవారం హైదరాబాద్ కు రానున్నారు. 5 నెలలకు పైగా జైలు జీవితం గడిపిన కవిత నిన్న తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఇవాళ ఆమె హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికే అవకాశం ఉంది. అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్తారు. అంతకుముందు ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతారని సమాచారం.

కాగా మార్చి 15న ఇడి అధికారులు ఆమెను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  ఆతర్వాత కోర్టు ఆదేశాలతో కవితను తీహార్ జైలుకు తరలించారు. ఆ తర్వాత జైలులోనే సిబిఐ ఆమెను అరెస్టు చేసింది. ఈ రెండు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన పిటిషన్ పై నిన్న విచారించిన సుప్రీంకోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News