Monday, December 23, 2024

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ కవిత పర్యటన

- Advertisement -
- Advertisement -

ముంగండలో ముత్యాలమ్మ అమ్మవారి
ఆలయ పున:ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న కవిత

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ముంగండ గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పున:ప్రతిష్ట కార్యక్రమంలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆదివారం నాడు అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అమ్మవారి దయతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా ఎంఎల్‌సి కవిత మాట్లాడుతూ… ముత్యాలమ్మ అమ్మవారి పున:ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. 400 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడం పూర్వజన్మసుకృతమని అనుకుంటున్నానని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలు సుభీక్షంగా ఉండి ప్రగతి పథంలో ముందుకు సాగే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి దయతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు బాగుండాలని ప్రార్థించానని చెప్పారు.

Kavitha 2

Kavitha 3

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News