Tuesday, January 21, 2025

స్వరాజ్యం భౌతికకాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ కవిత..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం భౌతికకాయానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లు స్వరాజ్యం బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి 7.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.  దీంతో ప్రజల సందర్శనార్థం నగరంలోని ఎంబీ భవన్‌లో ఆమె భౌతికకాయాన్ని ఉంచారు. ఆదివారం ఉదయం ఎమ్మెల్సీ కవిత ఆమె భౌతికకాయానికి నివాళులర్పించి.. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. నిజాం నిరంకుశాన్ని ఎదురించిన ధీశాలి మల్లు స్వరాజ్యం అని, తమలాంటి ఉద్యమకారులకు స్వరాజ్యం ఆదర్శంగా నిలిచారని అన్నారు. తెలంగాణలో తుపాకీ పట్టిన మొదటి మహిళగా కీర్తి గడించారని, గొప్ప యోధురాలి శకం ముగిసిపోయిందని పేర్కొన్నారు.

MLC Kavitha Tribute to demise of Mallu Swarajyam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News