హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కవిత హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. 2001లో టిఆర్ఎస్ పార్టీ పెట్టే నాటికి రాష్ట్ర సాధన కోసం అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయని, నిస్పృహలో ఉన్న తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి రాజకీయ ప్రక్రియ ద్వారా రాష్ట్రాన్ని సాధిస్తానని కేసీఆర్ ముందు అడుగు వేశారని కవిత పేర్కొన్నారు. చిన్న రాష్ట్రాల ఆవిర్భావం అనే అంశం, దేశ రాజకీయాలు, జాతీయ పార్టీల మీద ఆధారపడి ఉన్న సమయంలో, తన రాజకీయ చతురతను ప్రదర్శించి, దేశంలోని వివిధ పార్టీల మద్దతు కూడగట్టి, మొదటిసారిగా తెలంగాణ అంశాన్ని జాతీయ రాజకీయ ఎజెండాలో చేర్చి, రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పించి, వివిధ పార్టీలతో జై తెలంగాణ అనిపించడానికి ప్రజా పోరాటాలను నిర్మించి, అంతిమంగా రాజకీయ ప్రక్రియ ద్వారా రాజ్యాంగ బద్ధంగా, శాంతియుతంగా, దేశ భౌగోళిక చిత్రపటాన్ని మారుస్తూ 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో టిఆర్ఎస్ పాత్ర అద్వితీయమని అన్నారు. రాష్ట్ర సాధనలో ప్రధాన కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయనతో నడిచిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.. వారికి అండగా నిలిచిన తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకొని 21వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
MLC Kavitha tweet on 21st Anniversary of TRS