Sunday, December 22, 2024

పదేళ్ల ‘అంబేద్కర్’ జ్ఞాపకం

- Advertisement -
- Advertisement -

MLC Kavitha Tweet on Ambedkar Birth Anniversary

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం
ఏర్పాటు కోసం ఎమ్మెల్సీ కవిత చేసిన అకుంఠిత దీక్షకు దశాబ్దం పూర్తి
అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకై
ఇందిరా పార్క్ లో ఎమ్మెల్సీ కవిత 48 గంటల దీక్ష
ఎమ్మెల్సీ కవిత దీక్షకు తలొగ్గిన సమైక్య రాష్ట్ర ప్రభుత్వం
అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన
ఆనాటి జ్ఞాపకాలను ట్విట్టర్ లో పంచుకున్న ఎంఎల్‌సి కవిత

హైదరాబాద్:  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం 2012 లో 48 గంటల దీక్ష చేసిన విషయాన్ని ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ట్విట్టర్ లో పంచుకున్నారు. పదేళ్ల మధుర జ్ఞాపకం అంటూ కవిత ట్వీట్ చేశారు. భారత రాజ్యాంగ రూపకర్త, అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన అంబేద్కర్ విగ్రహం చట్ట సభలో ఏర్పాటు చేయాలని హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వేదికగా 2012 ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 15 వరకు కవిత 48 గంటల దీక్ష చేశారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కవిత దీక్షకు మద్దతుగా నిలిచాయి. ఎంఎల్‌సి కవిత దీక్షకు తలొగ్గిన ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తు న్నట్లు ప్రకటిం చింది. ‘అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు కోసం 2012 లో 48 గంటల దీక్ష’ అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News