Monday, December 23, 2024

కుంకుమబొట్టు ఎంతో హిజాబ్ అంతే

- Advertisement -
- Advertisement -

MLC Kavitha Tweet on Hijab Controversy

మతమేదైనా మనమంతా భారతీయులమే
మతతత్వశక్తుల విద్వేషాలకు బాలికల విద్య బలికాకూడదు
హిజాబ్ వివాదంపై ఎంఎల్‌సి కవిత ట్వీటు

 

మన తెలంగాణ/హైదరాబాద్: హిజాబ్ అంశానికి సంబంధించి టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత గురువారం నాడు స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. స్త్రీలు స్వంతంగా నిర్ణయాలు తీసుకొనే శక్తి ఉందన్నారు. స్త్రీలు సృష్టికర్తలు అని ఆమె చెప్పారు. నుదుటిపై సింధూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ అయినప్పుడు హిజాబ్ ధరించడం ముస్కాన్ వ్యక్తిగత స్వేచ్ఛే అవుతుందని ఆమె చెప్పారు. ఎలా ఉండాలి? ధరించాలి? అనే అంశాలు మహిళల ఇష్టాఇష్టాలకే వదిలేయాలని ఆమె కోరారు. మతతత్వ శక్తుల విద్వేషాలకు భయపడి, అందమైన భవిష్యత్ కోసం కలలు కంటున్న ఆడపిల్లల సుందరస్వప్నాలను చిదిమివేయవద్దన్నారు. విద్యాలయాల్లో రాజకీయాలు వద్దని ఎంఎల్‌సి కవిత విజ్ఞప్తి చేశారు. స్త్రీలు తమ ఇష్టంతో ఏదైనా ధరించవచ్చన్నారు. స్త్రీల వ్యక్తిగత విషయాల్లో నాగరిక సమాజం జోక్యం చేసుకోకూడదన్నారు. అంతేకాదు హిందీలో రాసిన కవితను కూడా ఆమె ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

ఎంఎల్‌సి కవిత రాసిన ‘కవిత’
హిందూ-ముస్లిం-క్రిస్టియన్…
మతమేదైనా సరే..
మనమంతా భారతీయులమే..
‘త్రివర్ణ పతాకాన్ని’ రూపొందించిన పింగళి వెంకయ్య అయినా..
‘జైహింద్’ అని నినదించిన అబిద్ హసన్ సఫ్రానీ అయినా..
సారే జహాసే అచ్చా హిందూస్తాన్’ అని ఎలుగెత్తి చాటిన ముహమ్మద్
ఇక్బాల్ అయినా..
‘జన గణ మన’తో జాతిని ఏకం చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ అయినా..
మనకు చెప్పింది ఒక్కటే..
మనం ఎవరైనా.. మనమంతా భారతీయులమే..!!

I put vermilion whenever I want, its a choice. As a society, weve no right to interfere in their personal choice: TRS MLC K Kavitha, on #HijabRow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News