Monday, January 20, 2025

28 స్లారు చెప్పినా… 28 వేల సార్లు చెప్పినా అబద్ధం నిజం కాదు: కవిత

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: బిజెపి నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఎంఎల్‌సి కవిత స్పందించారు. ఛార్జిషీట్‌లో తన పేరు 28 సార్లు రాసిన, 28 వేల సార్లు రాసిన అబద్ధం నిజం కాబోదని తన ట్విట్టర్‌లో కవిత ట్వీట్ చేశారు. ఢిల్లీ మద్యం కేసులో తాజాగా కవిత పేరును ఛార్జ్‌షీట్‌లో ఇడి చేర్చింది. నిజం నిలకడ మీద తేలుతుందని’ ట్రూత్ విల్ ప్రివెయిల్’ అనే యాష్ ట్యాగ్‌ను ఆమె జత చేశారు. మాట జారకు రాజగోపాల్ అన్న ఎన్ని సార్లు చెప్పిన అబద్ధం ఎప్పుడు నిజం కాదన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ చేసిన విమర్శలపై కూడా కవిత ఘాటుగా స్పందించారు. తనపై వచ్చిన నిందలన్నీ బోగస్ అని, తప్పు అని ఆమె ట్విట్టర్‌లో వివరించారు. రైతుల వ్యతిరేక విధానాలు, పెట్టుబడిదారుల అనుకూల విధానాలను తన అధినేత సిఎం కెసిఆర్ లేవనెత్తడంతో తమపై రాజకీయ కక్ష వేధింపులకు బిజెపి పాల్పడుతోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News