Friday, December 20, 2024

మొదలైన మరో ప్రస్థానం : కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం సందర్భంగా టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. తెలంగాణ భూమికగా, భారతావని వేదికగా సమగ్ర సమ్మిళిత, అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా మొదలైన కెసిఆర్ మరో ప్రస్థానం మొదలైందని కవిత తన ట్వీట్‌లో పేర్కొన్నారు. జై తెలంగాణ.. జై భారత్.. జై బిఆర్‌ఎస్.. జై కెసిర్ అనే నినాదాలను కవిత పేర్కొన్నారు.

ఢిల్లీని జయించే దిశగా బిఆర్‌ఎస్ దూసుకుపోవడం ఖాయం :

జోగినపల్లి సంతోష్‌కుమార్ టిఆర్‌ఎస్ బిర్‌ఎస్ సర్కార్‌గా అవతరించిందని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అధికారికంగా బిఆర్‌ఎస్‌కు ఇసి అనుమతి లభించిందని వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త పార్టీ జెండాను ఆవిష్కరించి, ఎగురవేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. మొదటి నినాదం ఇప్పట్నించీ కిసాన్ సర్కార్‌గా ఉండబోతోందన్నారు. ఢిల్లీ జయించే దిశగా బిఆర్‌ఎస్ దూసుకుపోవడం ఖాయమన్న ఆశాభావాన్ని ఎంపి సంతోష్ వ్యక్తపర్చారు. అంతేకాదు, బిఆర్‌ఎస్ ఆవిర్భావ కార్యక్రమంలో తాను పాలుపంచుకున్న దృశ్యాలకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్‌లో ఎంపి సంతోష్ జతచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News