హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ తల్లిని…కాంగ్రెస్ తల్లిగా మార్చేశారని ఎంఎల్ సి కవిత వ్యాఖ్యానించారు. నేడు సాయంత్రం సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ‘ఎక్స్’ వేదిక లో సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి రూపురేఖలను పూర్తిగా మార్చేయడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటుందని ఆరోపించారు. ఉద్యమ తల్లిని…నేడు కాంగ్రెస్ తల్లిగా మార్చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ తల్లి విగ్రహావిష్కరణను తాము తిరస్కరిస్తున్నామని అన్నారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను కూడా దూరం చేశారని ఆక్షేపించారు.
తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం దురదృష్టకరం
రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్ళు పెడుతుంది
ఉద్యమ తల్లిని నేడు కాంగ్రెస్ తల్లిగా మార్చారు
రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రహదారిలో ఏర్పాటు చేసి…. తెలంగాణ తల్లి అని…
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 9, 2024