Wednesday, January 22, 2025

స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న కవిత..

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. కరీంనగర్ లోని స్వయంభు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం తన అదృష్టం అన్నారు. మంత్రి గంగుల కమలాకర్ అద్భుతంగా స్వామి వారి వేడుకలని నిర్వహిస్తున్నారని, ఇక్కడ కూడా తిరుపతిలో మాడ వీధులు ఉన్నట్టుగానే ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. స్వామివారి అనుగ్రహం తెలంగాణపై ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

MLC Kavitha visit Venkateswara Swamy in Karimnagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News