Wednesday, January 22, 2025

ధైర్యంగా ఉండండి..కుటుంబానికి పెద్దదిక్కు మీరే : కవిత

- Advertisement -
- Advertisement -

పటాన్ చెరు: అతి పిన్న వయసులో తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో ఎదుగుతున్న గూడెం విష్ణువర్ధన్ రెడ్డి అకాల మరణం అత్యంత బాధాకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుమారుని కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయిన గూడెం మహిపాల్ రెడ్డిని ఆదివారం ఆమె పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రజలకు నిరంతరం సేవచేసే ఎమ్మెల్యే జిఎంఆర్‌కు పుత్రశోకం కలగడం తనను దిగ్భ్రాంతిని గురిచేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విధి వక్రీకరించి జరిగిన ఈ సంఘటన నుంచి త్వరగా కోలుకోవాలని ఆమె ధైర్యం చెప్పారు.

కుటుంబానికి పెద్దదిక్కు మీరేనని గుండెను నిబ్బరం చేసుకొని అందరికీ మనోధైర్యం కల్పించాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని ఆమె ఓదార్చారు. అదేవిధంగా పుత్రశోకంలో ఉన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నివాసానికి చేరుకొని వారి కుటుంబాన్ని పలువురు ప్రముఖులు పరామర్శించారు. అచ్చంపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, రాష్ట్ర మాజీ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు బీబీ పాటిల్ శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని కలిసి విష్ణువర్ధన్ రెడ్డి మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News