Thursday, January 23, 2025

అంజన్న క్షేత్రంలో కవితమ్మ పూజలు

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత మంగళవారం తెల్లవారు జామున కొండగట్టు అంజన్న సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కవితకు ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామి వారి సన్నిధిలో కవిత పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు ఆమెకు ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ, ప్రసాదాలను అందజేశారు.

అయితే కవిత ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా సాధారణ భక్తురాలిగా ఆలయానికి చేరుకుని అంజన్న స్వామిని దర్శించుకున్నారు. కవిత కొండగట్టుకు వస్తున్న విషయాన్ని చాలా గోప్యంగా ఉంచడంతో బిఆర్‌ఎస్ నేతలెవరూ కనిపించకపోగా, కవిత స్వామి వారిని దర్శించుకుని వెళ్లి పోయే వరకు విషయం ఎవరికీ తెలియలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News