Sunday, February 23, 2025

మహిళా బిల్లు దానికి ముడిపెట్టొద్దు: కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎంఎల్‌సి కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి రాజకీయ అభద్రతను మహిళా ప్రాతినిధ్యానికి ముడిపెట్టొద్దని సూచించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లపై బిజెపి రెండు సార్లు మోసం చేసిందని దుయ్యబట్టారు. సంఖ్యాబలం ఉన్న బిజెపి మహిళా బిల్లును ఎందుకు ఆమోదించడంలేదని కవిత ప్రశ్నించారు. చట్టసభల్లో మహిళలలకు రిజర్వేషన్ల బిల్లును బిజెపి తీసుకరావాలని డిమాండ్ చేశారు. చట్టం ఉన్నందునే స్థానిక సంస్థల్లో 14 లక్షల మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News