Monday, January 20, 2025

24 గంటల టైం ఇస్తున్నా.. ఎంపి అరవింద్ కు కవిత వార్నింగ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిజామాబాద్ బిజెపి ఎంపి ధర్మపురి అరవింద్ కుమార్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆమె మీడియాతో అరవింద్ పై నిప్పులు చెరిగారు. “24 గంటల టైం ఇస్తున్నా.. నా అవినీతి చిట్టా నీ దగ్గర ఉంటే తీసుకురా. నా భర్తను రాజకీయాల్లోకి లాగడం సరికాదు. అరవింద్ ఎక్కడ నిలబడితే నేను అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తా. బీజేపీ, కాంగ్రెస్ లు తలకు మాసిన రాజకీయం చేస్తున్నారు.

మాకు బీజేపీకి ఎలాంటి పొత్తు లేదు.. బీజేపీతో మకు పోటీ లేదు. అల్టిమేట్ గా కాంగ్రెస్తోనే మాకు పోటీ. నిజామాబాద్ జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో తిరుగులేని మెజారిటీతో గెలుస్తాం. 2014లో టిఆర్ఎస్ గవర్నమెంట్ గురించి ఏమీ తెలియకపోయినా అప్పుడే గెలిపించారు. ఇప్పుడు మనం చేసిన మంచి పనులు ప్రజలకు బాగా తెలుసు అందుకే మనల్ని తెలంగాణ రాష్ట్రంలో భారీ మెజారిటీగా గెలిపిస్తారని సర్వేలో తేలింది. ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఇంకా భారీ మెజారిటీ వస్తుంది” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News