కరీంనగర్: భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ అని ఎంఎల్‌సి కవిత తెలిపారు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో జరిగిన బిఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కవిత మాట్లాడారు. చరిత్ర సృష్టించిన పార్టీ బిఆర్‌ఎస్ అని, జగిత్యాల నియోజకవర్గంలో 63 వేల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, 25 వేల మంది బిడి కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అప్‌డేట్ లేని ఔడేటెడ్ పొలిటీషియన్ అని కవిత ఎద్దేవా చేశారు. రూ.130 కోట్లతో జగిత్యాల రూపు రేఖలు మారుస్తున్నామని, జగిత్యాలలో 60 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారన్నారు. ఎన్నికలు రాగానే ప్రజలను మోసం చేసేందుకు చాలా మంది వస్తారని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి గ్రామాల్లో చర్చించాలని, ఎన్నికల తరువాత మండలంగా అల్లిపూర్‌ను చేస్తామన్నారు. కాంగ్రెస్ నేతల కపట మాటలు ప్రజలు నమ్మొద్దని కవిత హితువుపలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంఎల్‌సి కవిత, ఎంఎల్‌ఎ డా సంజయ్ కుమార్, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, ఎంఎల్‌సి ఎల్ రమణ, బిఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read: విమానం గాల్లో… బాత్రూమ్ లో శృంగారం…. వీడియో వైరల్