Sunday, January 19, 2025

317 పై కవిత వర్సెస్ మంత్రి శ్రీధర్‌ బాబు

- Advertisement -
- Advertisement -

శాసన మండలిలో 317జీవో రచ్చ రేపింది. బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత, మంత్రి శ్రీధర్ బాబు మధ్య ఆసక్తికర చర్చకు దారితీసింది. ఎంఎల్‌సికవిత మాట్లాడుతూ గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పడు ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల మేరకు 317జీవో తీసుకరావడం జరిగిందని వెల్లడించారు. అందులో సమస్యలుంటే అధికారంలోకి వచ్చిన మీరు పరిష్కరించకుండా ఇంకా మాపై నిందలెందుకు? అని ప్రశ్నించారు. 317జీవో సమస్యలపై ఎంఎల్‌సిలు కోదండరాం, తీన్మార్ మల్లన్న, కవిత, జీవన్ రెడ్డి, ఎవిఎన్ రెడ్డి, వాణిలు మాట్లాడారు. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు సమాధానం ఇస్తూ కేంద్రహోంశాఖ నుంచి ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌లో మార్పులతోనే 317జీవో వివాదాలకు శాశ్వత పరిష్కారమని స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లతో అశాస్త్రీయంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తెచ్చారని విమర్శించా రు. దీంతో ఉద్యోగుల స్థానికత, సీనియార్టీలపై వివాదాలు రేగాయని, నాలుగు జిల్లాలకు కొత్త ఉద్యోగాలు రాని పరిస్థితి ఏర్పడిందన్నారు.

317జీవో రద్దు చెద్దామన్న మళ్లీ కొత్త సమస్యలొస్తా యన్న ఆందోళన ఉందన్నారు. 317జీవోను ఉద్యోగులు మరణ శాసనంగా భావించారన్నారు. రాష్ట్ర ఉద్యోగుల ఫౌజు సమస్యలతో పాటు సెంట్రల్ ఎంప్లాయిస్ ఫౌజు కేసులపై కూడా నిర్ణయం తీసుకోవాల్సిఉందన్నారు. 317జీవో బాధితు లకు న్యాయం చేసేందుకు, సమస్యలు పరిష్కరిం చేందుకు సిఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సబ్ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. దరఖాస్తుల వడపోత తర్వాత ప్రస్తుతం 32వేలకు పైగా దరఖాస్తులు ఉన్నాయన్నారు. 12మార్లు ఇప్పటికే సబ్ కమిటీ సమావేశమైందని, స్థానికత వివాదంగా మారిం దని, అడ్వకేట్ జనరల్ తో ఐదు సార్లు భేటీ అయ్యామని, శాస్త్రీయంగా సమస్య పరిష్కారం జరిగేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఉద్యోగుల సర్వీస్, పదోన్నతుల పరిరక్షణకు గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 2018లో తీసుకొచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలులో ఉండేంత వరకు సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని పరిష్కరించే ప్రయత్నం జరుగుతుందన్నారు.

ఇప్పటివరకు కొన్ని వెసులుబాటుతో 317జీవో కు సంబంధించి వివిధ శాఖల పరధిలోని కొన్ని వందల దరఖాస్తులు పరిష్కరించామని వెల్లడించారు. కాగా, 317 జీవోను ఆనాడు విమర్శించిన కోదం డరాం ఇప్పుడు రెండుమూడు జిల్లాలకు ఎఫెక్టు అయ్యిందన్నారని, ఆనాడు తెలంగాణ అంతా బాధ పడుతుందని మాట్లాడారని ఎంఎల్‌సి కవిత గుర్తు చేశారు. కొంతమందికి జీవోతో ఇబ్బంది ఏర్పడితే వాటిని ప్రభుత్వమే పరిష్కరించాలన్నా రు. దీనిపై కోదండరాం స్పందిస్తూ ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడంతో పాటు అన్ని జిల్లాల్లోనూ దీంతో సమస్యలు ఏర్పడ్డాయన్నారు. అయితే, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ 317జీవోతో కొన్ని లాభాలు కూడా ఉన్నాయని వివరిస్తూ అటువంటి వాటిని కొనసాగేలా సమస్యలను పరిష్కరించా లని సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News