Monday, January 20, 2025

ధరణీని బంగాళాఖాతంలో పడేస్తే రైతుబంధు ఎలా వస్తుంది…

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాటలు విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎంఎల్‌సి కవిత మండిపడ్డారు. తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీపై కవిత విమర్శల గుప్పించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును రాహుల్ గాంధీ చదువుతున్నారని, కాళేశ్వరం, మిషన్‌భగీరథ ప్రాజెక్టుల ఖర్చు రూ. లక్ష కోట్ల లోపు ఉంటుందని, రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆర్మూర్ నియోజకవర్గంలో 365 రోజుల పాటు చెరువులు కళకళలాడుతున్నాయని, రైతులంటే కాంగ్రెస్‌కు చిన్నచూపు అని, ధరణీని బంగాళాఖాతంలో పడేస్తే రైతుబంధు ఎలా వస్తుందని ఆమె నిలదీశారు.

తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ ప్రేమికులకు మధ్య యుద్ధం జరుగుతోందని, సింగరేణి కార్మికులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ కాదా? అని కవిత చురకలంటించారు. తెలంగాణ ఏర్పాటు చేయడంతో ఆలస్యం చేయడంతో ఎంతో మంది యువకులు అమరులయ్యారని ధ్వజమెత్తారు. తెలంగాణ ద్రోహీ టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత తొమ్మిది సంవత్సరాల నుంచి రాహుల్ ఒక్కసారి కూడా తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్‌లో మాట్లాడలేదని దుయ్యబట్టారు. సింగరేణి కార్మికులు కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారన్నారు.

Also Read: కాంగ్రెస్ గెలిస్తే కర్నాటక గతే!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News