Wednesday, December 4, 2024

హామీలు అమలు చేయకుండా దివ్యాంగులను మోసం చేసిన కాంగ్రెస్:ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులను మోసం చేసిందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత విమర్శించారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ దివ్యాంగుల సమైక్య సంఘం ప్రతినిధులు, శేరిలింగంపల్లి బిఆర్‌ఎస్ నేత చిర్ర రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని నివాసంలో ఎంఎల్‌సి కవితను కలిశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 500 రూపాయలు ఉన్న దివ్యాంగుల పెన్షన్‌ను 4,000 రూపాయలకి తెలంగాణ మొదటి సిఎం కెసిఆర్ పెంచారని ఎంఎల్‌సి కవిత గుర్తుకు చేశారు. దివ్యాంగులకు దేశంలోనే అత్యధికంగా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని వ్యాఖ్యానించారు.

దివ్యాంగుల స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు అందించడం, దివ్యాంగుల సంక్షేమ బడ్జెట్‌ను నాలుగు రెట్లు పెంచడం లాంటి అనేక గొప్ప కార్యక్రమాలను కెసిఆర్ ప్రభుత్వం అమలు చేసిందని ఎంఎల్‌సి కవిత తెలిపారు. అయితే దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఏడాది దాటినా అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్‌డబ్లూపిడి 2016 చట్టాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. దివ్యాంగులకు రిజర్వేషన్లను కూడా సరైన రీతిలో అమలు చేయడం లేదని విమర్శించారు. దివ్యాంగులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, సబ్సిడీ రుణాలు, పెన్షన్ల పెంపు వంటి అంశాలపై అసెంబ్లీలో చర్చించాలని, తెలంగాణ దివ్యాంగుల సమైఖ్య సంఘం ప్రతినిధులు ఎంఎల్‌సి కవితకు వినతి పత్రం అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News