Thursday, January 23, 2025

ధర్నా కోసం ఢిల్లీ వెళ్లిన ఎంఎల్‌సి కవిత..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులు ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితకు బుధవారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9న ఉదయం 11 గంటలకు ఢిల్లీ కార్యాలయానికి వచ్చి విచారణకు సహకరిం చాల్సిందిగా ఇడి అధికారులు కవితకు సూచించారు.

అయితే, ఆ తేదీకి తాను విచారణకు రాలేనని కవిత ఇడిని కోరారు. అయితే తనకు ముందస్తుగా ఖరారైన కార్యక్రమాలు ఉన్నాయని, వాటిలో ముఖ్యమైన కార్యక్రమాలు సహా ఈనెల 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ధర్నా వంటివి ఉన్నందున 9న తాను విచారణకు హాజరుకాలేనని కవిత ఇడికి లేఖ రాశారు. తాను 15వ తేదీన విచారణకు హాజరు అవుతారని చెప్పారు. ఇప్పటికే కవితను ఇదే కేసులో సిబిఐ ఓసారి విచారించింది. ఇప్పుడు ఇడి విచారణ చేయనుంది.

మరోవైపు, జంతర్ మంతర్ వద్ద ధర్నాకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు కవిత ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. కవిత దీక్షకు 18 పార్టీలకు చెందిన నేతలు హాజరుకానున్నారు. సిపిఎం జాతీయ నేత సీతారాం ఏచూరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని సమాచారం. అలాగే సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ . రాజా ముగింపు ఉపన్యాసం చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు భారత జాగృతి ఏర్పా ట్లు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News