మాదన్నపేట్‌ః ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవిత తీహార్ జైలుకు వెళ్లడం ఖాయమని నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ అన్నారు. ఆదివారం రాత్రి ఐఎస్‌సదన్ డివిజన్ వినయ్‌నగర్ కాలనీలో ప్రజా గోస బిజెపి భరోసా కార్యాక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ధర్మపురి అరవింద్, ఐఎస్‌సదన్ డివిజన్ కార్పొరేటర్ శ్వేతారెడ్డి, భ్యాగనగర్ జిల్లా అధ్యక్షులు సంరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా నాయకులు వీరేందర్ బాబు, మధుకర్ రెడ్డి, శేఖర్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ కెసిఆర్ సర్కార్ అవినీతికి హద్దు లేకుండా పోయిందన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టుల్లో కల్వకుంట్ల కటుంబం 30శాతం కమీషన్‌తో దాదాపు 80వేల కోట్లు సంపాధించారని తెలిపారు.
ఆ డబ్బుతోనే బిఆర్‌ఎస్ పార్టీ పెట్టారని వివరించారు. ఢీల్లీ లిక్కర్ స్కాం కేసుల్లో కల్వకుంట్ల కవిత 100కోట్ల ముడుపుల కేసులో కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ డబ్బులను ఆప్ పార్టీ పంజాబ్, గోవాలో ఎన్నికలకు ఉపయోగించిందని పేర్కొన్నారు. ఢీల్లీ ఉపముఖ్య మంత్రి మనీష్ సిసోడియానే సిబిఐ వదలలేదని కవిత ఓ లెక్కనాని ఎద్దేవా చేశారు. త్వరలో కల్వకుంట్ల కవిత తీహార్ జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కార్యకర్తలందరూ కష్టపడి పని చేస్తే కేంద్రంలోను, తెలంగాణ రాష్ట్రంలోను విజయం తధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సందీప్, శరత్ చంద్ర, సాయిసాగర్, రాజేందర్, విశాల్, శ్వేతా, సురేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.