Tuesday, January 21, 2025

ప్రీతి మృతికి కారణమైన దోషులను ప్రభుత్వం వదిలిపెట్టదు: కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ) పీజీ విద్యార్థిని ప్రీతి తల్లిదండ్రులకు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత లేఖ రాశారు. ప్రీతి కన్నుమూసిందని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి తోనయ్యాని పేర్కొన్నారు. ప్రీతికి ఇలా జరగటం జీర్ణించుకోలేక పోతున్నానని తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకూ రాకూడదన్నారు. ప్రీతి కుటుంభానికి ప్రభుత్వం, బిఆర్ఎస్ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ప్రీతి మృతికి కారణమైన దోషులను ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి నిమ్స్ లో చికిత్స పొందుతూ పీజీ స్టూడెంట్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమించి మృతిచెందిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News