Thursday, January 23, 2025

ఎంఎల్‌సి కవిత అరెస్ట్ అప్రజాస్వామికం : పోచారం శ్రీనివాసరెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్‌సి కవితను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మాజీ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే కవిత అరెస్ట్ జరిగిందని ఆరోపించారు. సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా ఇడి అరెస్ట్ చేయడం న్యాయ హక్కులకు వ్యతిరేకమని అన్నారు. అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం బిజెపి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామిక వాదులు కవిత అరెస్ట్‌ను ఖండించాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరారు.
కవిత అరెస్టు పూర్తిగా అప్రజాస్వామిక చర్య: కడియం శ్రీహరి
లోకసభ ఎన్నికల ముందు భారత రాష్ట్ర సమితిని మానసికంగా దెబ్బ తీయాలనే ఆలోచనతో రాజకీయ కుట్రతో ఎన్నికల నోటిపికేషన్ వెలువడే సమయంలో అరెస్టు చేయడం పూర్తిగా అప్రజాస్వామిక చర్య అని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా కవిత అరెస్టును నిరసిస్తూ శనివారం ఉదయం 11 గంటలకు నియోజకవర్గ కేంద్రంలో నిరసన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. భారత రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొని అక్రమ అరెస్టును ఖండించాల్సిందిగా కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News