Wednesday, January 22, 2025

జీవన్‌రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంపై బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి గురువారం మండిపడ్డారు. జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ… జీవన్ రెడ్డి కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడాలన్నారు. నన్ను క్వీన్ ఎలిజబెత్ రాణి అని పిలుచుడు కాదు. నేను మీ ఇటలీ రాణిని కాదన్నారు. మీ ఇటలీ రాని లెక్క నేను వందలాది తెలంగాణ బిడ్డల ప్రాణాలను నేను బలి తీసుకోలేదు. మీరు దిగజారిపోయి హోదాను మరిచిపోయి తెలంగాణకు ప్రతీక అయినటువంటి బతుకమ్మను అవమానించినా కూడా నేను సంయమనంతో మాట్లాడుతున్నానని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News