Monday, December 23, 2024

కెసిఆర్ దీక్ష చేస్తేనే తెలంగాణను ప్రకటించారు: కవిత

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బబ్బర్ షేర్ కాదు.. పేపర్ పులి మాత్రమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. శనివారం జగిత్యాలలో కవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉపాధి కోసం వెళ్లి గల్ఫ్లో చనిపోయిన వారికీ బీమా వస్తుందని చెప్పారు. గల్ఫ్ లో ఉన్నవారి పేర్లు రేషన్ కార్డుల నుంచి ఎట్టి పరిస్థితిలో తొలగించమని తెలిపారు. సింగరేణి కార్మికులకు భారాస హయాంలోనే న్యా యం జరుగుతుందని.. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు చెప్పే మోసపు మాటలు నమ్మి ఆగం కావొద్దన్నారు.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బబ్బర్ షేర్ కాదని.. పేపర్ పులి మాత్రమేనని అన్నారు. గాంధీ కుటుంబానికి తెలంగాణకు మధ్య ఉన్నది అనుబంధం కాదని.. విద్రోహక సంబంధం ఉందని కవిత అన్నారు. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ దీక్ష చేస్తేనే తెలంగాణను ప్రకటించారని చెప్పారు. వయసు మరచి జీవన్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని కవిత మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News