Friday, December 20, 2024

కాంగ్రెస్ లోకి ఎంఎల్ సి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కుచుకుళ్ల దామోదర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ కుచుకుళ్ల దామోదర్ రెడ్డి హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ తన తనయుడు రాష్ట్ర డెంటల్ కౌన్సిల్ చైర్మన్ కుచుకుళ్ల రాజేష్ రెడ్డితో పాటు తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని బహిర్గతం చేశారు. నాలుగున్నరేళ్ల ఎమ్మెల్సీ పదవి సమయం ఉన్నా పదవికి, పార్టీకి రాజీనామా చేసి ఈ నెల 20వ తేదీన కొల్లాపూర్‌లో జూపల్లికృష్ణారావు సారథ్యంలో

జరుగుతున్న బహిరంగ సభలో ప్రియాంకగాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక నాయకత్వంతో పోసగకపోవడంతో పాటు పార్టీలో తనకు గుర్తింపు ఇవ్వడం లేదనే పార్టీ మారుతున్నట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా గతంలో కూడా ఆయన ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. తదనంతరం బిఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్సీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా పని చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా బిఆర్‌ఎస్ నుంచి గెలుపొంది నేటికి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News