Friday, November 15, 2024

ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన పోచంపల్లి

- Advertisement -
MLC Nomination by Pochampally Srinivas
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోమవారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. వరంగల్ కలెక్టరేట్ లో ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి విశ్వ నారాయణకు ఈ రోజు నామినేషన్లు అందించారు. కాగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రెండు నామినేషన్లు వేయగా, పోచంపల్లి తరపున మరో రెండు నామినేషన్లు పడ్డాయి. నామినేసన ప్రక్రియలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తో కలిసి ఒక సెట్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తో కలిసి ఒక సెట్ నామినేషన్లను పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వేశారు. అనంతరం జెడ్పీ చైర్మన్లు కుసుమ జగదీష్, పాగాల సంపత్ రెడ్డి, చైర్ పర్సన్ గండ్ర జ్యోతిలు ఒక సెట్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ లు ఒక సెట్ చొప్పున పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తరపున నామినేషన్లు వేశారు.
ఈ సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్న పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విజయం ఖాయమని జోస్యం చెప్పారు. రైతు బంధువుగా ఉన్న సిఎం కెసిఆర్ ఆశీస్సులు, ప్రజల ఆదరాభిమానాలు టిఆర్ఎస్ కు మెండుగా ఉన్నాయన్నారు. అందరి శ్రేయస్సు కోసం కెసిఆర్ పని చేస్తున్నారని ప్రశంసించారు. దేశంలోని రైతులకు న్యాయం చేసే విధంగా కెసిఆర్ ఆలోచన విధానాలు ఉన్నాయని, మరి కేంద్రంలో ప్రధాని మోడీని ఒప్పించి, రైతుల కరెంట్ మోటర్లకు మీటర్లు పెట్టకుండా ఒప్పించాలన్నారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతామని హెచ్చరించారు.
పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. సిఎం కెసిఆర్ ఆశీస్సులు, టిఆర్ఎస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ అండదండలు, మంత్రుల ఆశీర్వాదాలు, ఓటర్ల ఆదరాభిమానాలతో తాను మరోసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఎన్నిక అవుతానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కాగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఉమ్మ‌డి వరంగల్ జిల్లా టిఆర్ఎస్ అభ్య‌ర్థిగా పోచంపల్లి ఎంపికైన సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఉమ్మ‌డి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొన‌సాగుతున్న పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప‌ద‌వి కాలం జ‌న‌వ‌రి 4తో ముగిసిపోనుంది.
హన్మకొండ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి తదితరులతో కలిసి పోచంపల్లి నామినేషన్ పత్రాలను చూపించారు. మంత్రితో కలిసి నామినేషన్లు దాఖలు చేయడానికి వెళ్ళారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News