Friday, December 20, 2024

రెండు ఎంఎల్‌సి స్థానాలకు నొటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ఎంఎల్‌ఎ కోటాలో ఎంఎల్‌సి స్థానాలకు తాజాగా అసెంబ్లీ కార్యాలయం నోటిఫికేషన్ విడదల చేసింది. ఎంఎల్‌సిలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు అసెంబ్లీ ఎన్నికలలో ఎంఎల్‌ఎలుగా గెలుపొందడంతో ఎంఎల్‌సి పదవులకు రాజీనామా చేశారు. రెండు సీట్లకు విడివిడిగానే ఎన్నికలు జరుగుతాయని అసెంబ్లీ కార్యాలయం వెల్లడించింది. గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని, తుది గడువు 18 వరకు ఉంటుందని పేర్కొంది. 19న నామినేషన్ల పరిశీలన ఉంటుందని, 22 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. జనవరి 29న పోలింగ్ జరగడంతో పాటు ఫలితాలు కూడా వెల్లడిస్తారు. రెండు స్థానాలకు ఎన్నికలు జరుగనుండడంతో సంఖ్యాబలం ఆధారంగా కాంగ్రెస్ పార్టీకే రెండు సీట్లు దక్కుతాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News