Sunday, November 3, 2024

మత్స్యకారులకు అండగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

MLC Padi Kaushik Reddy releases fishes in pond

చెరువులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్సీ
మత్యకారుల అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

కమలాపూర్‌ః జిల్లాలోని కమలాపూర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువులో శుక్రవారం హుజురాబాద్ నియెజకవర్గ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, హుజురాబాద్ నియోజకవర్గ టిఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ చేప పిల్లలను చేరువులో వదిలారు. అనంతరం వారు మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అబివృద్ది కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో ముదిరాజ్ కులస్థులు ఉన్నతిగా ఎదగాలని కోరారు. మత్స్యకారుల అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్పి కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్‌పి చైర్మన్ సుధీర్‌బాబు, కరీంనగర్ జడ్‌పి చైర్మన్ కనుమల విజయ, యంపిపి తడక రాణి శ్రీకాంత్, జడ్‌పిటిసి లాండిగె కళ్యాణి లక్ష్మణ్ రావు, పేరాల సంపత్ రావు, నవీణ్‌కుమార్, ఇమ్మడిశెట్టి శ్రీనివాస్, కమలాపూర్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్లె సమ్మిరెడ్డి, కమలాపూర్ గ్రామ సర్పంచ్ కట్కూరి విజయ రెడ్డి, యంపిటిసిలు, జమ్మికుంట జడ్‌పిటిసి శ్రీరాం శ్యాం, జమ్మికుంట మున్సీపల్ చైర్మన్ తక్కళ్ళపెల్లి రాజేశ్వర్ రావు, జమ్మికుంట వ్యవసాయ మార్కేట్ కమిటి మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి వివిధ గ్రామాల సర్పంచ్‌లు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News