Monday, December 23, 2024

తెలంగాణ ప్రభుత్వంపై కుట్రలు బిజెపికి అసాధ్యం: ఎమ్మెల్సీ పల్లా

- Advertisement -
- Advertisement -

MLC Palla Rajeshwar Reddy Fires On BJP

హైదరాబాద్: దేశంలోని విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలగొట్టాలని కేంద్రంలోని ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ముగ్గురు ఎమ్మల్యేలు లేని బిజెపి తెలంగాణ ప్రభుత్వంపై కుట్ర చేయాలని చూస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై కుట్రలు బిజెపికి అసాధ్యమని ఎమ్మెల్సీ పల్లా వెల్లడించారు. కేంద్రం దేశవ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. దేశంలో ఇరిగేషన్ కొత్త పాలసీలు రావాలన్నారు. ఆ పాలసీలకు తెలంగాణ నేపథ్యం కావాలని పల్లా తెలిపారు. దేశంలో మత పిచ్చి రేపాలి, దేశాన్ని ఇబ్బందుల్లో పెట్టి తాము మాత్రమే రాజ్యమేలాలని ఏదైతే ప్రయత్నం జరుగుతున్నదో దాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News