Sunday, December 22, 2024

బిఆర్‌ఎస్‌ను వీడను.. బిజెపిలో చేరను: పట్నం మహేందర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి బిజెపిలో చేరుతున్నట్లు సామాజిక మాద్యమాల్లో జోరుగా ప్రచారం జరుతోంది. ఈ ప్రచారంపై మహేందర్ రెడ్డి స్పందించారు. బిజెపిలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బిఆర్ఎస్ ను వీడేది లేదని ఆయన తేల్చిచెప్పారు. అసత్య ప్రచారాన్ని మంత్రి కెటిఆర్ దృష్టికి తీసుకెళ్లాలని వెల్లడించారు. మే 25 నుంచి తాండూరు నియోజకవర్గంలో పల్లెపల్లెకు పట్నం కార్యక్రమంలో పాల్గొంటనన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బిఆర్ఎస్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News