హైదరాబాద్: కాంగ్రెస్ నేత మధుయాష్కీ స్థాయిని మించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పని చెయ్యకపోతే విమర్శలు చేయాలి కానీ- అభివృద్ధి చేస్తుంటే విమర్శలు చేస్తారా? అని ప్రశ్నించారు. మధుయాష్కీని రాష్ట్ర ప్రజలు అడ్డుకోవాలని ఎక్కడా తిరుగనియ్యొద్దని ప్రజలకు సూచించారు. 2007-14 లో 36 కోట్లు మాత్రమే ఇసుక పై ఆదాయం వచ్చిందిని, 2014 నుంచి 4వేల కోట్లకు పైగా ఇసుకపై ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని, కాంగ్రెస్ పాలనలో ఇసుకపై ఆదాయం ఎక్కడ పోయిందని సతీష్ కుమార్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో బ్రోకర్లు ఇసుకపై 4వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారని మండిపడ్డారు. కమీషన్ల కోసం బీ- ఫామ్ లు అమ్ముకున్న చరిత్ర మధుయాష్కీదని మండిపడ్డారు.