హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ నేతలు కలిసి రాలేదని ఎంఎల్‌సి పురాణం సతీష్ కుమార్ తెలిపారు. శాసన సభలో గవర్నర్ తమిళ సై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సతీష్ మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేసిందన్నారు. వ్యవసాయానికి 24 గంటలు నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్నామని, రెండు లక్షల ఉద్యోగాలు కల్పించే ఐటిఐఆర్‌ను కేంద్రం రద్దు చేసిందని, ఆయుష్మాన్ భారత్‌కు రూ.2 లక్షల లిమిట్ 26 లక్షల మందికే వర్తిస్తుందని, ఆరోగ్య శ్రీలో రూ.5 లక్షల లిమిట్‌తో 76 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాన్ని గౌరవించాలని ఆయుష్మాన్ భారత్‌కు తెలంగాణలో అవకాశం కల్పించామని, తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అభినందిస్తున్నాయని మెచ్చుకున్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు గ్రాంట్ ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా కూడా మోడీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిలోనే తెలంగాణ ప్రభుత్వం అప్పులు తీసుకుందన్నారు.
ఆయుష్మాన్ లో 26 లక్షల మంది… ఆరోగ్య శ్రీలో 76 లక్షల మంది: పురాణం
- Advertisement -
- Advertisement -
- Advertisement -