- Advertisement -
హైదరాబాద్: కలెక్టర్లను బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బెదిరిస్తున్నాడని ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ అన్నారు. మంగళవారం ఉదయం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ”ఈటల రాజేందర్, అతని భార్య మాట్లాడటాన్ని ఖండిస్తున్నా. ఈటల.. ఒక్క ఎకరానికి ఒకసారి ముక్కు నేలకు రాస్తా అన్నాడు. 71 ఎకరాలు కబ్జా చేసాడు.. అంటే 71 సార్లు ముక్కు నేలకు రాయాలి. ఇన్ని ఎకరాలు కబ్జా చేసిన ఈటలను బీజేపీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్న. అక్రమాలను అవినీతి పాల్పడుతున్న ఈటల రాజేందర్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. తెలంగాణ ప్రజలకు ఈటల క్షమాపణ చెప్పాలి” అని మండిపడ్డాడు.
MLC Satish Kumar press meet over Etela land issue
- Advertisement -