Monday, January 20, 2025

ఆ ఎంఎల్‌సి స్థానం ఇప్పటికే నాలుగు సార్లు గెలిచాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నల్లగొండ -ఖమ్మం-వరంగల్ ఎంఎల్‌సి పట్టభద్రుల స్థానంలో ఇప్పటికే నాలుగు సార్లు గెలిచామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. బుధవారం కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. విద్యావంతుడు రాకేశ్ రెడ్డి పట్టభద్రుల ముందుకు వస్తున్నారని, విద్యావంతులైన మిత్రులంతా తమకు అండగా నిలబడాలని, కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజలంతా విన్నారని, జాబ్ క్యాలెండర్ అన్నారు ఇప్పటివరకు ఏమీ లేదని ఎద్దేవా చేశారు. మెగా డిఎస్‌సి అని, యువతను కాంగ్రెస్ దగా చేసిందని దుయ్యబట్టారు. యువత సమస్యలపై బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలు గతంలో పోరాటం చేశారని, ఇప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నారని కెటిఆర్ చెప్పారు. బిఆర్‌ఎస్ పార్టీ తరపున ఎంఎల్‌సిగా రాకేశ్ రెడ్డి పోటీ చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News